మీతో నటించేందుకు వేచి చూస్తున్నా!

‘‘తిథి పాత్ర మాత్రమే కాదు, మరొక సినిమా చేద్దామని మాటిచ్చిన నాగార్జున ఇంతవరకు ఏం చెప్పలేద’ని అంటోంది కథానాయిక రేఖ. ‘ఆనందం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైన ఈ భామ తొలి ప్రయత్నంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. ‘ఒకటో నంబరు కుర్రాడు’తో యువత హృదయాలు దోచుకుంది. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడుగా వచ్చిన ‘మన్మథుడు’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. అసలు విషయం ఏంటంటే.. మన్మధుడు చిత్రం షూటింగ్‌ సమయంలో ప్రత్యేక పాత్ర కాదు మరో సినిమా చేద్దామన్నారట నాగ్‌. అయితే అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ఆ అవకాశం రాలేదు. ఆలీ వ్యాఖాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో జాలీగా’ కార్యక్రమానికి విచ్చేసి ఇలా అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేసింది రేఖ. ‘‘ఈ మాట ఎప్పుడో చెప్పారు. ఇప్పటి వరకు ప్రామిస్‌ నిలబెట్టుకోలేదు. సర్‌ ఇంకా వేచి చూస్తున్నాన’’ని నాగ్‌ని ఉద్దేశించి సరదాగా చెప్పుకొచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.