మరోసారి దొడ్డ మనసు చాటుకున్న అక్షయ్‌


మిషన్‌ మంగళ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. వరదలకు బీహార్‌, అస్సాంలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తాజాగా ఈ రాష్ర్టాలకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ కోటీ రూపాయల విరాళం ప్రకటించి తన దొడ్డ మనసును చాటుకున్నారు. అక్షయ్‌ ఆగస్టు 13న బీహార్‌, అస్సాం ముఖ్యమంత్రులతో మాట్లాడారట. తమ రాష్ర్టాలకు సాయం చేసినందుకు ఇద్దరు సీఎమ్‌లు అక్షయ్‌కి ధన్యవాదాలు కూడా తెలిపారు. అక్షయ్‌ ఇప్పుడే కాదు దేశానికి ఎలాంటి విపత్తు వచ్చిన సాయం చేయడంలో ముందుంటారు. కోవిడ్‌-- -19 సంక్షోభ సయమంలో మార్చి నెల్లో పీఎమ్‌ కేర్స్ కు 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. తరువాత సినీ కార్మికుల కోసం, ముంబై పోలీసులు, వైద్యుల కోసం కూడా పీపీఇ కిట్లతో పాటు కొంత నగదు కూడా అందించారు. తాజాగా అక్షయ్‌ ప్రపంచంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటీనటుల్లో ఫోర్బ్స్ 2020 జాబితాలో ఆరోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన సంపాదన 362 కోట్లు పైగా ఉంది. అక్షయ్‌ కుమార్‌ ప్రస్తుతం బెల్‌బాటమ్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ యుకేలో జరుగుతోంది. అక్షయ్‌ ‘రక్షాబంధన్’‌ అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిమాన్షు శర్మ కథను అందిస్తున్నారు. ఎ ఎల్లో ప్రొడక్షన్స్, కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం వచ్చే ఏడాది నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అక్షయ్‌ కుమార్‌ గత ఏడాది నాలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. వాటిలో ‘కేసరి’, ‘మిషన్‌ మంగళ్’‌, ‘హౌస్‌ఫుల్‌4’, ‘గుడ్‌న్యూజ్’‌లాంటి ఉన్నాయి. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.