మన రౌడీ.. హీరో అవుతున్నాడబ్బీ!!

‘ఏందిరా... అబ్బి’ అంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన శైలీతో కూడిన యాసతో గుర్తింపుపొందారు జయప్రకాశ్‌ రెడ్డి. ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు ఆయన. ఈ సీనియర్‌ నటుడు ఇప్పుడు వెండితెరపై కథానాయకుడిగా కనిపించబోతున్నారు. అది కూడా ఒక ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుకుంటుంది. ఈ చిత్రంలో కేవలం జయప్రకాశ్‌ రెడ్డి ఒక్కరే పాత్రధారి కావటం విశేషం. ‘అలెగ్జాండర్‌’ పేరుతో ధవళ సత్యం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక్కడే నటుడు...అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌ లైన్‌. కథా, కథనాలు నచ్చి జెపీనే స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అతి తొందరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.