అలీ ఫోటో తీశాడంటే..పెళ్లయిపోద్ది

అలీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పండుగాడి ఫొటోస్టూడియో’. రిషిత కథానాయిక. వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది... అనేది ఉపశీర్షిక. దిలీప్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. గుదిబండి వెంకటసాంబిరెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హాస్యం ప్రధానంగా సాగే చిత్రమిది. జంధ్యాల మార్క్‌ కథ, కథనాలతో రూపొందుతోంది. నలభయ్యేళ్లు వచ్చే వరకు కథానాయకుడికి పెళ్లి కాదనే శాపం ఉంటుంది. ఈలోగా కథా నాయిక కంచు కనకరత్నంతో పరిచయం ఏర్పడటం, ఆమెతో ప్రేమలో పడటం, ఆ తర్వాత శాపం వల్ల జరిగే పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా స్వచ్ఛమైన వినోదంతో రూపొందిస్తున్నాం. అలీ నటన ప్రధాన ఆకర్షణ. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. వినోద్‌కుమార్‌, బాబూమోహన్‌, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్‌జగన్‌, సందీప్‌రాజా, టీనా చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఛాయాగ్రహణం: మురళీమోహన్‌రెడ్డి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.