మేలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సెట్లోకి అలియా!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). ఇందులో అలియా భట్‌ రామ్‌ చరణ్‌ సరసన నటిస్తోంది. సినిమా ఇప్పటికే డెభ్బై అయిదు శాతం షూటింగ్‌ పూర్తి చేసుకొంది. కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్‌ షెడ్యూల్‌ వాయిదా పడింది. తిరిగి షూటింగ్‌ని మేనెల్లో ప్రారంభించనున్నారని చిత్రబృందం తెలిపింది. రామ్‌ చరణ్, అలియా భట్‌ల మీద పాటతో తిరిగి షూటింగ్‌ ప్రారంభించనున్నారట. సినిమాకి సంబంధించి ఈమధ్యనే రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఒవర్‌తో ‘భీం ఫర్‌ రామరాజు‘ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సినీ అభిమానులు ఆకట్టుకుంటోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని, హాలీవుడ్‌ నుంచి ఒలివియా మోరిస్, అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌లాంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారు. 400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.