బన్నీ ‘ఐకాన్‌’లో దిశా పఠానీ?

యంగ్‌ హీరో అల్లు అర్జున్ జోరు పెంచాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తూనే మరో రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నాడు. వాటిలో ఒకటి సుకుమార్‌, మరొకటి వేణు శ్రీరామ్‌ తెరకెక్కించనున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళ్లనుందో స్పష్టత లేదు. వేణు శ్రీరామ్‌ ఇప్పటికే ‘ఐకాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ కథలో యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండబోతుందట. అందుకే హీరోయిన్‌గా బాలీవుడ్‌ కథానాయికను తీసుకునే ప్రయత్నాలు చేస్తుందట చిత్ర బృందం. ఈ నేపథ్యంలో అలియాభట్‌ను సంప్రదించగా.. ఆమె తిరస్కరించిందట‌. ఆ స్థానంలో దిశా పఠానీని ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. గతంలో ఈ భామ వరుణ్‌తేజ్‌ హీరోగా వచ్చిన ‘లోఫర్‌’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.