అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కొన్ని రోజుల కిందటే మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరణ మొదలైంది. అక్కడ రామ్‌లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రెండు యాక్షన్ ఘట్టాల్ని, ఓ పాటని తెరకెక్కించారు. మరికొన్నాళ్లపాటు అక్కడే చిత్రీకరణ జరగాల్సి ఉండగా, చిత్రబృందం అర్ధంతరంగా ఈ షెడ్యూల్‌కి ముగింపు పలికింది. ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ బయల్దేరింది. కరోనా భయాలతోనే తాత్కాలికంగా చిత్రీకరణని నిలిపేసినట్టు సమాచారం. సుకుమార్- బన్నీ కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.