నెట్‌ఫ్లిక్స్‌లో ‘వైకుంఠపురం’?

అల్లు అర్జున్, పూజ హెగ్డే వైకుంఠపురములోకి ఎలా వెళతారో తెలియదు కానీ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ప్లిక్స్‌లోకి వెళుతున్నట్టున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు కానీ అల్లు అర్జున్‌ సినీ కెరీర్‌లోనే భారీ ధరకు ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ను అమ్మినట్లు సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ అవ్వటం, భారత్‌లో అమెజాన్‌కి పోటీగా నెట్‌ప్లిక్స్‌ గట్టి పోటీ ఇవ్వటం కోసం ఈ సినిమాకు అంత ధర చెల్లించిదని విశ్లేషకుల మాట. పైగా రోజురోజుకి డిజిటల్‌ మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండటం మరో కారణం. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్‌ వీక్షణలతో రికార్ఢులు సృష్టిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.