దసరాకు రానున్న అల్లుడు అదుర్స్

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న చిత్రం అల్లుడు అదుర్స్. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కథానాయికగా నభా నటేష్‌ చేస్తుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందులో మరోకథానాయికగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. అంతేకాదు కరోనా సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌ని ఈ నెల చివర నుంచి మొదలుపెట్టనున్నట్లు చిత్రనిర్మాణ సంస్థ ఆ మధ్య తెలిపింది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంజి రమేష్‌ కుమార్‌ సమర్పణలో సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచంగా సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె. నాయుడు పనిచేస్తున్నారు. ఇంకా చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు సక్రమంగా జరిగి ఉంటే చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ 30న తెరపైకి వచ్చేది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.