అమలాపాల్‌ ఇంట విషాదం

ప్రముఖ కథానాయిక అమలాపాల్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి పాల్‌ వర్గీస్‌ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అమల తను నటించిన ‘అదో అంద పరవైపోల’ సినిమా ప్రొమోషన్‌ కోసం చెన్నై వెళ్లింది. తన తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వగ్రామానికి చేరుకుంది. కురుప్పంపాడి ప్రాంతంలోని ఓ చర్చిలో పాల్‌ వర్గీస్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అమలా సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టంలేదని, కుటుంబ సభ్యులు, బంధువులు నచ్చజెప్పడంతో తర్వాత ఓకే చెప్పారని పలు సందర్భాల్లో తెలిపింది అమలా పాల్‌.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.