మామిడిని మూద్దాడినిన అమలాపాల్‌

దక్షిణాది నటి అమలాపాల్‌ లాక్‌డౌన్‌ కారణంగా తల్లితో కలిసి ఉంటుంది. నిన్న ఆదివారం కేరళలో వేసవి చిరు జల్లులు కురిసాయి. ఈ సందర్భంగా అమలాపాల్‌ వర్షపు జల్లులు పడిన తరువాత ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టును ముద్దాడుతూ చాలా ఆనందంగా కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియోను అమలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ‘‘ఏదైనా సరే మొదటిది చాలా ప్రత్యేకం. లాక్‌డౌన్‌లో కురిసిన మొదటి వర్షం. ఈ సంవత్సరపు మొదటి మామిడి కాయలు..నా మొదటి జర్నీ ఆఫ్‌ సెల్ఫ్‌ లవ్‌ అండ్‌ హీలింగ్‌.. ప్రపంచానికి వర్షం ఎంత ఆనందాన్ని ఇస్తుందో’’ అంటూ పేర్కొంది. మొత్తం మీద అమలాపాల్‌ చిన్నపిల్లలా మారిపోయింది. ప్రస్తుతం మలయాళంలో బెస్సీ దర్శకత్వంలో ‘ఆదుజీవితం’ అనే చిత్రం పృథ్వీరాజ్‌తో కలిసి నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Amala Paul ? (@amalapaul) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.