పెళ్లి ఫోటోలు కాదంటోన్న అమలాపాల్‌!

దక్షిణాది నటి అమాలాపాల్‌ పెళ్లి చేసుకొందంటూ కొద్దిరోజులగా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ముంబైకి చెందిన గాయకుడు భవీందర్‌ సింగ్‌ని రెండో పెళ్లి చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్త, ఫోటోలపై అమలాపాల్‌ తాజాగా స్పందిసూ..‘‘నేను పెళ్లి రెండో పెళ్లి చేసుకొన్నాను అనే వార్త నిజం కాదు. నేను ఓ వ్యాపారసంస్థలో భాగస్వామిగా ఉన్నాను. అందుకోసం ఓ ఫోటో షూట్‌ చేశాం. మేము కలిసున్న ఆ ఫోటోలు కేవలం సంస్థ వ్యాపారంలో భాగంగానే అంతకుమించి భవీందర్‌ సింగ్‌ నేను కలిసున్న ఫోటోలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. నేను మళ్లీ రెండో వివాï ాం చేసుకుంటే మీ అందరికి చెప్పే చేసుకుంటాను. రహస్యంగా ఏమీ చేసుకోనంటూ’’ చెప్పింది. గతంలో అమలాపాల్‌ ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కొన్నాళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు.

View this post on Instagram

A post shared by Amala Paul ? (@amalapaul) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.