అరకోటి ఇచ్చిన అమితాబ్‌!

బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ సినిమాల్లోనే కాదు, దాతృత్వంలోనూ తన పెద్దమనసును చాటుకున్నారు. గత కొన్నాళ్లుగా కురస్తున్న వర్షాలకు బీహార్‌ విలవిలలాడింది. లక్షలాది మంది ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అందుకోసం అమితాబ్‌ తనవంతు బాధ్యతగా బీహార్‌ సీఎం రిలీఫ్‌ పండ్‌కి యాభైఒక్క లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని తన ప్రతినిధితో బీహార్‌ ఉపముఖ్యమంత్రికి అందించారు. దానితో పాటు ఓ లేఖను కూడా అమితాబ్‌ పంపారు. లేఖలో ఏముందంటే..‘‘బీహార్‌ ప్రజలు ప్రకృతి వైపరిత్యానికి చాలా ఇబ్బందులు పడ్డారు. వరదల్లో ఎంతో మంది ఆస్తిపాస్తులు, ప్రాణాలు కోల్పోయారు. వారందరికి నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నానంటూ’’ పేర్కొన్నారు. తెలుగులో ఈ మధ్యనే విడుదలైన ‘సైరా’ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం మరికొన్ని బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘బ్రహ్మాస్త్రా’.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.