ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన21వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ కథానాయకుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తోంది. చిత్రంలో అమితాబ్‌ది కేవలం అతిధి పాత్రలో నటిస్తున్నారని తొలుత వార్తలొచ్చాయి. అయితే చిత్ర నిర్మాత ప్రియాంక దత్ బిగ్ బి పాత్రపై స్పందిస్తూ ‘‘అమితాబ్ బచ్చన్ చిత్రంలో కొద్ది సేపు ఉండిపోయే పాత్ర కాదు. ఆయన పూర్తి నిడివి గల పాత్ర చేస్తున్నారు. సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం ఉంటుంది. బిగ్ బి పాత్రకు దక్షిణాది భాషల్లో వాయిస్ డబ్బింగ్ సమస్య ఉంది. ఆయనకు సరిపోయే గొంతు కోసం వెతుకుతున్నామని’’ తెలిపారు. మొత్తం మీద వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మితమయ్యే పాన్ ఇండియా చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియదు. కానీ ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుల పేర్లు సామాజిక మాధ్యమాల్లో వైరలౌతున్నాయి. చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లి, 2022నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్లో ఉన్నారు.