గిన్నిస్‌ వరల్డ్ రికార్డు కోసం ‘గుజార్‌ జాయేగా’

బాలీవుబ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ నేతృత్వంలో 115 మంది నటీనటులు గాయనీగాయకులు కలిసి ‘గుజార్‌ జాయేగా’ అనే ఆల్బమ్‌ చేశారు. ఈ నెలలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో విడుదలైన ఈ స్ఫూర్తి గీతాన్ని యాభైమంది గాయనీగాయకులు ఆలపించగా, 65 మంది నటీనటులు, క్రీడాకారులు ఇందులో కనిపించారు. ఒకే భాషలో ఇంతమంది కలిసి గాయకులు పాల్గొనడం ఇదే మొదటిసారి అని నిర్మాత వరుణ్‌ గుప్తా తెలిపారు. గతంలో మైకేల్‌ జాక్సన్‌ తన నలభైమందితో కలిసి చేసిన ఆల్బమ్‌ గిన్నిస్‌ వరల్డ్ రికార్డు ఉంది. ఆ తరువాత ఇంతమందితో కలిసి చేసినా ఆల్బమ్‌ ఇదే.  ప్రస్తుతం లిమ్కా బుక్ ఆఫ్‌ రికార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజల మనసుల్లో స్ఫూర్తి నింపడం కోసం తయారు చేసిన ఈ పాటలో అమితాబ్‌ బచ్చన్‌, రవీనా టాండన్‌, సన్నీలియోని, శ్రేయా ఘోషల్‌, సోను నిగమ్‌తో పాటు క్రీడాకారులు సానియా మీర్జా, మహేష్‌ భూపతి, సుశీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  జై వర్మ నిర్మాణదర్శకత్వంలో వచ్చిన ఈ పాటని సి‌ద్ధాంత్‌ కౌశల్‌ రాయగా జాజీమ్‌ శర్మ స్వరాలు సమకూర్చారు. వరుణ్ ప్రభుదుయాల్ గుప్తా, జే వర్మ, వినయ్ వశిష్త్, టీనాలు నిర్మాతలుగా వ్యవహరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.