సుధీర్ బాబు కథానాయకుడుగా కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీ దేవి సోడా సెంటర్’. సూరిబాబు పాత్రలో కనిపించబోతున్నాడు సుధీర్. 80ల్లో సాగే అమలాపురం నేపథ్యంతో రూపొందుతందీ చిత్రం. సుధీర్‌బాబుకి జోడీగా ఆనంది ఎంపికైనట్టు తాజా సమాచారం. పల్లెటూరి అమ్మాయి పాత్ర కావడంతో ఆనంది అయితే బావుంటుందని సంప్రదించారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరి శ్రీదేవి కథేంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. విజయ్ చిల్లా-శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.‘ఈ రోజుల్లో’ సినిమాలో ప్రత్యేక పాటలో మెరిసిన ఈ తెలుగమ్మాయి ‘బస్టాప్’ చిత్రంతో కథానాయికగా మెప్పించింది. ఈ తర్వాత కొన్ని తెలుగు కథల్లో నటించి ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉంది. మళ్లీ ‘జాంబిరెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతుంది.
