ప్రతినాయకురాలిగా అనసూయ?

బుల్లితెర నుంచి వెండి తెరపై అడుగుపెట్టి నటిగా గుర్తింపు పొందిన వ్యక్తుల్లో అనసూయ ఒకరు. ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఆమెలోని నటిని మరో స్థాయికి తీసుకెళ్లింది. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసింది. ఇప్పుడు ప్రతినాయకులురాలి అవతారమెత్తబోతుందని టాలీవుడ్‌ టాక్‌. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో అనసూయకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆమె విలన్‌గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ప్రతినాయకులురాలికి నాయకుడు ఎవరో చూడాలి మరి. గతంలో తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. ప్రస్తుతం సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.