నితిన్ చిత్రంలో తమన్నా!

‘జయం’, ‘సై’ నటుడు నితిన్‌ హీరోగా బాలీవుడ్‌లో వచ్చిన ‘అంధాదున్’ చితాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంధాదూన్’‌ చిత్ర షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా వైరస్‌ వల్ల లాక్‌డౌన్ ప్రకటించడంతో సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. చిత్రంలో కథానాయికలుగా తమన్నా, నభా నటేష్‌ నటిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో టబు, రాధికా ఆఫ్టే పోషించిన పాత్రల్లో ఈ ఇరువురి భామలను తీసుకున్నారు. తొలుత ఈ పాత్రల కోసం నయనతార, ఇలియానా, శిల్పా శెట్టి తదితరుల పేర్లు కూడా అనకున్నారట. అయితే చివరకు చిత్ర నిర్మాణ సంస్థ తమన్నా - నభాలనే ఖాయం చేసింది. బి.మధు సమర్పణలో వస్తోన్న చిత్రాన్ని ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.