కన్నడ ‘శివప్ప’ చిత్రంలో అంజలి

‘జర్నీ’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘డిక్టేటర్’‌, ‘బలుపు’లాంటి చిత్రాలతో అలరించి తెలుగింటి అమ్మాయి అంజలి. తమిళ, మలయాళితో పాటు కన్నడ చిత్రాల్లోనూ అలరించింది. తాజాగా ఈ అమ్మడు కన్నడలో శివరాజ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘శివప్ప’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో శివరాజ్‌ కుమార్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారట. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ అంబార్‌, ధనంజయ్, శశి కుమార్‌ సినీయర్ నటి ఉమాశ్రీ కూడా నటిస్తోంది. నిర్మాత కృష్ణ సార్థక్‌ హీరోయిన్‌ల గురించి ఓ మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం..ఇప్పటికే సినిమా కోసం కొంతమంది కథానాయికలతో చర్చలు జరిపారట. చివరకు అంజలినే ఫైనల్‌గా ఖరారు చేశారని సమాచారం. అన్ని సక్రమంగా జరిగితే ఈనెల 23వ తేదీన ప్రారంభమయ్యే షూటింగ్‌ షెడ్యూల్లో అంజలి చేరనుందట. యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న చిత్రానికి అనూప్‌ సీలిన్‌ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. మొత్తం మీద అంజలి దక్షిణాది నటిగా అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ పేరుతెచ్చుకొంటోంది. ప్రస్తుతం అంజలి తెలుగులో ‘ఆనందభైరవి’, పవన్‌కల్యాణ్‌ సరసన ‘వకీల్‌సాబ్’‌ చిత్రంలో నటిస్తుంది. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనమ్‌ కోషియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌ పోలీస్‌గా కనిపించనున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనూ అంజలి నటిస్తోంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.