‘18 పేజెస్‌’లో అను?

నిఖిల్‌ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘18 పేజెస్‌’. సూర్య ప్రతాప్‌పల్నాటి దర్శకుడు. సుకుమార్‌ కథ, స్ర్కీన్‌ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో నాయికగా కృతిశెట్టిని ఎంపిక చేస్తున్నారని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడా స్థానంలో అను ఇమ్మాన్యుయేల్‌ పేరు వినిపిస్తోంది. ఈ కథకు అను అయితే సరిపోతుందని భావించిందట చిత్రబృందం. ఈ విషయంపై అనుతో చర్చలు సాగుతున్నాయని, మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.