ఆ అవకాశం అందుకుందా?

మలయాళి ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్‌ ఓ భారీ ప్రాజెక్టులో రెండో నాయికగా ఎంపికైందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. నిడివి తక్కువైనా గుర్తింపునిచ్చే పాత్రని తెలుస్తోంది. శర్వానంద్‌, సిద్థార్ద్‌ కథానాయకులుగా ‘మహా సముద్రం’ తెరకెక్కుతోంది. అజయ్‌ భూపతి దర్శకుడు. ఇప్పటికే ప్రధాన నాయికగా అదితిరావు హైదరిని ఎంపిక చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మరో నాయికకు అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అను పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో రెండో నాయికగా అనుని ఎంపిక చేశారంటూ టాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. తక్కువ సన్నివేశాలున్నా నటనకు ప్రాధాన్యమున్న పాత్రట. అందుకే అను ఓకే చేసిందని అంటున్నారు. మరి అను ఆ అవకాశం అందుకుందా? ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో నటిస్తుంది అను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.