అలాంటి సందర్భాల్లో నిద్ర కూడా పట్టదు!

‘మీరెప్పుడూ సంతోషంగా కనిపిస్తుంటారు. దాని వెనకున్న రహస్యమేంటి అని అనుపమ పరమేశ్వరన్‌ అడగ్గా?.. అందుకు స్పందిచిన పరమేశ్వరన్‌..‘‘నా పనిని నేను ప్రేమించడమే ఆ రహస్యం. చిన్నప్పటి నుంచి నటిని కావాలని కలగన్నా. దాన్ని నెరవేర్చుకున్నా. అందుకే నాకిష్టమైన ఈ నటనని ఎంతో ఆస్వాదిస్తున్నా. అదే సంతోషాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తుంటుంది. సెట్‌లో ఓ సన్నివేశాన్ని పూర్తి చేశాక.. అది నేననుకున్న దానికన్నా బాగా వస్తే మనసు ఖుషీ అవుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. మీరు నమ్ముతారో లేదో.. పని పట్ల ఎక్కువ సంతృప్తి పొందిన రోజు రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టదు. ఇప్పుడీ లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కు దూరమైనందుకు చాలా బాధగానే ఉంది. కానీ, మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పదు కదా. నేనైతే ఎప్పుడెప్పుడు మళ్లీ సెట్స్‌లోకి అడుగు పెడతానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నా..’’అంటూ సమాధానం చెబుతోంది.


View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.