స్వీటీ గాయపడిందా?
అగ్ర కథానాయిక అనుష్క ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్‌లో గాయపడ్డారట. ఇటీవల సినిమాలోని ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో స్వీటీ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోమని అనుష్కకు సూచించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మీడియాకు చెప్పడానికి అనుష్క ఒప్పుకోలేదట. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోపక్క అనుష్క ‘సైలెన్స్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.