‘సైరా’లో స్వీటీ?

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవికథను ‘సైరా’గా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి, నయనతారలు నాయకనాయికలు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో బాలీవుడ్‌ బాద్‌షా అమితాబచ్చన్, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి వంటి ప్రముఖనటులు కీలక పాత్రల్లో కనింపించబోతున్నారు. తాజాగా ఓ విశేషం తెలిసింది. ఈ సినిమాలో మరో పాత్రలో అనుష్క వినింపించబోతోంది. కథ 19వ శతాబ్దం నాటిది కావటంతో నేరుగా కథలోకి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే కథను పరిచయం చేసేందుకు వాయిస్‌ ఓవర్‌ అవసరం అలా ఈ సినిమాలో అనుష్కశెట్టి(స్వీటీ)ని తీసుకొంటున్నారని సమాచారం. ఈ విషయాన్ని అధికారంగా వెల్లడించాల్సిఉంది. లైకా నిర్మాణ సంస్థ రూ. 200కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.