అనుష్క పూర్తి చేసేసింద‌ట

చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `సైరా`లో అనుష్క ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించే పాత్రలో ఆమె సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ పాత్ర కోసం ఏరికోరి అనుష్క‌ని తీసుకొన్నారు. చాలా రోజులు ఆమె కోసం ఎదురు చూసింది చిత్ర‌బృందం. ఎట్ట‌కేల‌కి ఇటీవ‌ల సెట్లోకి అడుగుపెట్టి త‌న భాగం స‌న్నివేశాల్ని పూర్తి చేసేసి బ‌య‌టికొచ్చింద‌ట అనుష్క‌. `సైలెంట్‌`తోపాటు, కొత్త‌గా మ‌రిన్ని చిత్రాలు చేయ‌డానికి ఒప్పుకుందామె. వాటితో బిజీ అయ్యాక `సైరా`కి కాల్షీట్లు కేటాయించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని భావించిన అనుష్క ముందుగా ఆ సినిమాని పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. ఇక చిరంజీవి, ఇత‌ర చిత్ర‌బృందంపై స‌న్నివేశాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయ‌ట‌. వాటిని పూర్తి చేసి ఆ వెంట‌నే పూర్తిస్థాయిలో నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌పై దృష్టిపెట్టాల‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. `సైరా`ని దస‌రా సంద‌ర్భంగా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకొన్నారు కానీ అది సాధ్య‌మ‌వుతుందో లేదో చూడాలి. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా `సైరా`ని చిరు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.