బన్నీకి చెల్లిని కాదు: నివేద

హీరో అల్లు అర్జున్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ రూపొందుతోంది. పూజాహెగ్డే కథనాయిక. ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ జరుపుకొంటోంది. బన్నీకి తల్లి పాత్రలో బాలీవుడ్‌ నటి టబు నటిస్తోంది.ఇందులో బన్నీకి చెల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందనే ప్రచారం జరుగుతోంది. బన్నీకి చెల్లి పాత్రలో నివేద థామస్‌ నటిస్తోందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నివేద దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించింది. ‘‘ ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించేందుకు ఎవ్వరు నన్ను సంప్రదించలేదు. కాబట్టి బన్నీకి చెల్లి పాత్రలో నటిస్తున్నాను అనే ప్రచారం నిజం కాదని కుండబద్దలు’’ కొట్టేసింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.