‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడి కోసం రణ్‌బీర్‌ ఎదురుచూపులు!

ప్రముఖ తెలుగు దర్శకుడు ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించాడు సందీప్‌ వంగా. తెలుగులో ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందించిందో అందరికి సుపరిచితమే. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌సింగ్’గా‌ తెరకెక్కించి బాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సందీప్‌ వంగ దర్శకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడట. ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌ సందీప్‌ వంగను సంప్రదించి మంచి కథను తయారుచేయమని కోరినట్లు బాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత మురాద్‌ ఖేతాని - రణ్‌బీర్‌లకు సందీప్‌ కథను వినిపించాడట. గ్యాంగస్టర్‌ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టును సందీప్‌ వంగా సిద్ధంగా ఉంచాడట. రణబీర్ కపూర్ ఇప్పటికే ‘బ్రహ్మాస్త్రా’ చిత్రంలో చేస్తున్నాడు. ఇందులో తన ప్రేయసి అలియా భట్ కథానాయికగా నటిస్తోంది. అయాన్‌ మఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కూడా నటిస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.