‘అసురన్‌’ దర్శకుడుతో సూర్య?

ధనుష్‌ కథానాయకుడుగా ‘అసురన్‌’ చిత్రం తెరకెక్కించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు వెట్రి మారన్‌. దీంతో ఆయన చేయబోయే తర్వాతి ప్రాజెక్టుపై సినీ అభిమానులందరిలో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఎందరో అగ్ర కథానాయకుల పేర్లు వినిపించాయి. అయితే ఈయన నటుడు సూర్యతో చేయబోతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే సూర్య 39వ చిత్రం వెట్రిమారన్‌తో అని నెట్టింట చర్చ ఊపందుకుంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు సాగాయిని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే నెటిజనుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చర్చకు కారణం ఏంటంటే? వెట్రిమారన్‌ డిసెంబరు 5న ఓ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నాని పెట్టడంతో.. అభిమానులు సినిమా ఖరారైందనే తరహాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.