తెలుగు ‘అయ్యప్పనమ్’‌ రీమేక్‌కి దర్శకుడిగా సాగర్‌ కె చంద్ర

మలయాళంలో ఘనమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసిందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో రానా, రవితేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్ర దర్శకుడు ప్రేమ్‌ సాగర్‌ కె.చంద్ర తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రానికి నాగవంశీ నిర్మాత. ఇప్పటికే అతనితో నిర్మాణ సంస్థ సంప్రదించిదట. అందుకు సాగర్‌ కూడా ఒప్పుకున్నాడని సమాచారం. అంతేకాదు స్ర్కిప్టులో తెలుగు నేటివిటికి దగ్గరగా ఉండేందుకు కొన్ని మార్పులను కూడా సూచించాడట. గతంలో ఈ సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరినాటికి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. మలయాళంలో ఈ మధ్యనే గుండెపోటుతో మరణించిన సచి ‘అయ్యప్పనమ్‌ కోషియం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. పృథ్వీరాజ్ మరియు బిజు మీనన్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ‘అయ్యప్పనమ్‌ కోషియం’ కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా 50 కోట్లకు పైగా  రాబట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ రీమేక్‌ హక్కులను బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నాడు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.