పులివేట దర్శకుడు బాబు శివన్‌ కన్నుమూత

తమిళ దర్శకుడు బాబు శివన్‌ ఈరోజు కన్నుమూశారు. శివన్‌ కాలేయ, మూత్రపిండాల జబ్బుతో బాధపడుతూ ముందుగా ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు యాభై నాలుగు సంవత్సరాలు. తమిళ నటుడు విజయ్‌ హీరోగా వచ్చిన ‘వేట్టైకారన్’‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటించింది. ఇక దివంగత నటుడు శ్రీహరి పోలీసు అధికారికగా నటించారు. చిత్రాన్ని తెలుగులో ‘పులివేట’ అనే పేరుతో అనువదించారు. ఇంకా హీరో విజయ్‌తో ‘కురువి’, ‘భైరవా’లాంటి చిత్రాలు చేశారు. బుల్లితెరపై తమిళ్లో ‘రసాతి’  అనే సీరియల్‌కి 28 నుంచి 110 ఏపిసోడ్స్ కి దర్శకత్వం వహించారు. ఇందులో నటి దేవయాని, తెలుగు నటుడు బాలాదిత్యలు నటిస్తున్నారు. బాబు శివన్‌ మరణం పట్ల తమిళ చిత్రసీమ ప్రముఖులు  నివాళులు అర్పించారు. 




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.