అమైరా - ప్రభుదేవాల ‘బగీరా​’ చిత్రం షూటింగ్‌ ప్రారంభం

నటుడు, డ్యాన్సర్‌ ప్రభుదేవా హీరోగా తమిళంలో నటిస్తున్న చిత్రం ‘బగీరా’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమైరా దస్తర్‌ నటిస్తుంది. సైకో థ్ర్లిల్లర్‌ నేపథ్యంలో రానున్న ఇందులో నలుగురు మహిళా నటీమణులు ఉండనున్నారట. లాక్‌డౌన్‌ తరువాత సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. సినిమా కోసం ముంబై నుంచి అమైరా దస్తర్‌ చెన్నైకి విమానంలో ప్రయాణించింది. అందుకు సంబంధించిన ఫోటోలను అమైరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.  ‘‘లాక్‌డౌన్ తరువాత మొదట విమానంలో ప్రయాణం అంటూ..’’ ట్యాగ్‌లైన్‌ తగిలించింది. ఇంకా చిత్రంలో గాయత్రి కథానాయికగా నటిస్తోంది. బి.గణేశన్‌ సంగీతం స్వరాలు సమకూరుస్తున్న చిత్రం షూటింగ్‌ చాలా వరకు పూర్తి చేసుకుందట. ఇంకా కేవలం 30 శాతం మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. చిత్ర షూటింగ్‌ని చెన్నై, కొచ్చిన్‌, శ్రీలంక జరుపుకొని చివరగా గోవాలో షెడ్యూల్‌ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ‘బగీరా’ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో ప్రభుదేవా రూపం ఆకట్టుకునేలా ఉంది. ఆర్‌.వి.భరతన్‌ నిర్మాత.

View this post on Instagram

A post shared by Amyra Dastur (@amyradastur93) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.