బాలకృష్ణ కోసం కథ సిద్ధం!!

లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణల నుంచి సినీతారలకు విరామం దొరికినా.. దర్శకులు మాత్రం కొత్త కథలను ముస్తాబు చెయ్యడంలో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా ఓ కొత్త కథను సిద్ధం చేశారు. అది మరెవరి కోసమో కాదు.. నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం. నిజానికి ఆయన బాలయ్య 100వ చిత్రానికి దర్శకత్వం చెయ్యాలనే అప్పట్లో గట్టిగా ప్రయత్నించారు. కానీ, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపంలో ఆ అవకాశాన్ని క్రిష్‌ కొట్టేశారు. కానీ, ఇప్పుడాయన మరోసారి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్‌ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే బాలకృష్ణకు కథ వినిపించేందుకు సిద్ధమౌతున్నారట అనిల్‌. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఎఫ్‌ 3’ తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లే చిత్రం బాలయ్యదే అవ్వాలని పట్టుదలతో ఉన్నాడట. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.