రైతు పాత్రలో కనిపించనున్న బాలయ్య?

బాలకృష్ణ చేయని పాత్రలంటూ ఏమీ లేవూ. గతంలో కాలేజీ కుర్రాడిగా, పోలీస్‌ అధికారికగా, డాక్టర్‌గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో బాలయ్య రైతు పాత్రలో కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్ర్కిప్టుని సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి డైలాగ్‌లు అందించిన బుర్రా సాయిమాధవ్‌ ఈ సినిమాకి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలోని నటీనటులు సాంకేతివర్గం గురించి ఇంకా తెలియదు. బాలకృష్ణ పల్లెటూరి రైతు పాత్ర అంటే మనకు గుర్తొచ్చే చిత్రాలు ‘మంగమ్మగారి మనవడు’. ‘ముద్దులకిష్టయ్య’లాంటివి ఎన్నో ఉన్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.