సంక్రాంతికి సందడి చేయనున్న ఎన్బీకే చిత్రం!

సినిమాలకు మన తెలుగు పండగలకు ఎంతో అనుబంధం ఉంది. సంక్రాంతికి పండగకి ఇంట్లోకి నవధాన్యాలు వచ్చినట్లు - వెండితెరపై సినిమాలు పోటీపడీ మరీ విడుదల అవుతుంటాయి. వచ్చే సంక్రాంతి పండక్కి తెలుగు హీరోల సినిమాలు ఎన్ని తెరపైకి వస్తాయో లేదో తెలియదు. కరోనా వైరస్‌ కారణంగా సంక్రాంతి రావాల్సిన సినిమాల షూటింగ్‌లు వాయిదా పడి, విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ - బోయపాటిల చిత్రం మాత్రం సంక్రాంతికి తెరపైకి రావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్రానికి సంబంధించి ‘బీబీ3’ ఫస్ట్ రోర్‌ పేరిట ఓ టీజర్‌ విడుదలై సందడి చేసింది. త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. చిత్రాన్ని ఏకమొత్తంగా ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు చిత్రంలో కథానాయికలుగా చాలామంది పేర్లే వినిపించిన చివరకి అంజలినే తీసుకున్నట్లు వార్తలు కూడా వినిపిస్తోన్నాయి. ఈ దసరా పండక్కి సినిమా పేరును కూడా ప్రకటించే అవకాశం పుష్కలంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోన్న ‘టార్చ్ బేరర్’‌ లేదా ‘మోనార్క్’, వీటిలో ఏ పేరు ఫైనల్‌ అవుతుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.