సినీనటుడు జేపీ కుటుంబానికి బాలకృష్ణ ఆర్థికసాయం!

ప్రముఖ సినీనటుడు జయప్రకాష్‌ రెడ్డి నిన్న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి చలనచిత్రసీమతో పాటు రాజకీయనాయకులు సైతం నివాళులు అర్పించారు. తెలుగు చిత్రసీమలో అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ సైతం తమ ఆవేదను సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. బాలకృష్ణ - జయప్రకాష్‌ రెడ్డిలు కలిసి నటించిన ‘సమరసింహారెడ్డి’ చిత్రంలో అప్పట్లో ఘనమైన విజయాన్ని అందించింది. జేపీ మృతి బాలకృష్ణ తన సానుభూతిని తెలియజేస్తూ..‘‘ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ..’’ ట్విట్టర్లో పేర్కొన్నారు. జేపీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం చేసినట్లు సమాచారం.Also Read : వెండితెరపై... సీమ పెతాపంCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.