మరో కథకి సిద్ధమయ్యారా?

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ వరస సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయ్యాక బి.గోపాల్‌తో మరో చిత్రం చేస్తున్నారని గతంలో వార్తలొచ్చాయి. అధికారికంగా వెల్లడించలేదు. ఇదిలా ఉండగానే బాలయ్య మరో కథకి ఓకే చెప్పారని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. ప్రముఖ రచయిత ఎం. రత్నం బాలయ్య కోసం అదిరిపోయే స్ర్కిప్టు రాశారని, ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు సాగాయని సినీ వర్గాల సమాచారం. ఈ కథకు బాలయ్య ఆసక్తి చూపుతున్నారట. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గతంలో బాలయ్య హీరోగా వచ్చిన ‘జై సింహా’ సినిమాకు కథ, సంభాషణలు అందించారు ఎం.రత్నం. ఈ సారి ఎలాంటి ఆసక్తికర కథాంశంతో వస్తారో చూడాలి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.