బాలయ్యతో అల్లరోడు?

‘మహర్షి’ చిత్రంలో మహేష్‌బాబుకు స్నేహితుడిగా ఓ చక్కటి పాత్రలో కనిపించి మెప్పించారు అల్లరి నరేష్‌. ఇప్పుడాయన మరో క్రేజీ ఛాన్స్‌ కొట్టేసినట్లు చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి హిట్‌ల తర్వాత వీళ్ల కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. దీంట్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పుడిందులో ఓ కీలక పాత్ర కోసం అల్లరి నరేష్‌ను సంప్రదిస్తోన్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు సహాయకుడిగా కనిపించబోయే ఈ పాత్ర ఆద్యంతం వినోదాత్మకంగా ఉండబోతుందని, అందుకే ఈ పాత్రకు నరేష్‌ సరిగ్గా సరిపోతారని చిత్ర బృందం భావించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి ఆయనకు ఆ పాత్ర గురించి తెలియజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అల్లరి నరేష్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.