బాలకృష్ణ - బోయపాటిల చిత్రం పేరు మోనార్క్?


యాక్షన్‌ చిత్రాలను తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను శైలి వేరు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా టైటిల్‌పై ఎన్నో ఉహాగానాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకి ‘మోనార్క్’ అనే చిత్ర టైటిల్‌ని ఫిల్మ్ ఛాంబర్లో నమోదు చేశారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు. ఆ రోజున సినిమా పేరుని అధికారికంగా ప్రకటించనున్నారని  చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. చిత్రంలో బాలయ్య రెండుకోణాల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర అఘోరగా కనిపించనున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈసినిమాకి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఇందులో కథానాయికగా నయనతార, శ్రియ శరణ్‌, నమిత లాంటి పేర్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కథానాయిక ఎవరనేది ఇంకా తెలియదు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కొత్త కథానాయికను పరిచయం చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నారు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.