బాల‌య్య సినిమా ఆగ‌లేదు.. కానీ!

నంద‌మూరి బాల‌కృష్ణ - కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబోలో ఓ సినిమా ఇప్ప‌టికే మొద‌లై, షూటింగ్ జ‌రుపుకోవాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఈ సినిమా పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని, బాల‌య్య మ‌రో క‌థ కోసం ఎదురు చూస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ... ఈ సినిమా ఆగిపోలేదు. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. అదే టీమ్ తో. కాక‌పోతే.. క‌థే మారింది. ఇంత‌కు ముందు అనుకున్న క‌థ‌ని పూర్తిగా పక్క‌న పెట్టేసిన కె.ఎస్. ర‌వికుమార్‌, బాల‌య్య‌కు కొత్త క‌థ వినిపించాడ‌ని స‌మాచారం. ఆ క‌థ‌ని బాల‌య్య కూడా ఓకే చేశాడ‌ట‌. ఈనెల‌లోనే లాంఛ‌నంగా షూటింగ్ మొద‌లెట్టాల‌ని చూస్తున్నారు. వ‌చ్చే నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ రోజు బాల‌య్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా కె.ఎస్‌.ర‌వికుమార్ హైద‌రాబాద్ వ‌చ్చి, బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు కూడా చెప్పాడు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రోసారి భేటీ జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.