బాలకృష్ణతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్న సాయేషా -పూర్ణ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ చిన్న బ్రేక్‌ తీసుకున్న తరువాత ఈరోజు నుంచి మళ్లీ జరుగుతోంది. అన్నట్లు ఇందులో కథానాయికలుగా సాయేషా సైగల్‌, పూర్ణలు నటిస్తున్నారు. ఈ ఇరువురు భామలు సైతం షూటింగ్‌ పాల్గొంటున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఇప్పటికే సినిమా నుంచి ఆ మధ్య బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని ‘బీబీ3 ఫస్ట్ రోర్’‌ పేరిట విడుదలైన వీడియో అందరిని అలరించింది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.