బాలకృష్ణతో నటించనుందా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్నా నాయిక మాత్రం ఖరారు కాలేదు. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ఇందులో ఇద్దరు భామలకు అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు చిత్ర బృందం నుంచి. ఈ నేపథ్యంలో చాలామంది నాయికల పేర్లు ప్రచారంలో నిలిచాయి. తాజాగా బాలయ్యకు జోడీ కుదిరింది అంటూ టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. మలయాళీ నటి ప్రగ్యా మార్టిన్‌ ఈ చిత్రంలో నాయికగా ఎంపికైందని టాక్‌. పలు తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి నటన చూపించింది ప్రగ్యా. త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వెల్లడించవచ్చు. మిర్యాల రవీందర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అంచనాలు పెంచుతోంది. ‘బీబీ 3’, ‘ఎన్బీకే 106’ వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.