బాలకృష్ణ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్‌!

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ని తీసుకొనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. వివేక్‌ ఒబెరాయ్‌ హిందీ చిత్రాల్లో హీరోగాను ప్రతినాయకుడి పాత్రల్లోనూ నటించి మెప్పించారు. ఇంకొంచెం ముందుకెళ్తే వివేక్‌ ఒబెరాయ్‌ గతంలోనే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. బాలకృష్ణ - బోయపాటి ముచ్చటగా వస్తున్న మూడో చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఆ మధ్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా సంజయ్‌దత్‌ని తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. చిత్రంలో బాలకృష్ణ రెండు రకాల గెటప్పుల్లో కనిపించబోతున్నారు. అందులో అఘోరా ఒకటి. ఇంకా కథానాయికలుగా ఎవరు నటిస్తున్నారనేది తెలియదు. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.