మలయాళి రీమేక్‌ చిత్రంలో బాలయ్య?

మలయాళంలో విజయవంతమైన కథలు తెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. తరచూ ఆ చిత్రాలు రీమేక్‌గా తెలుగులో రూపొందుతుంటాయి. తాజాగా ఆ ఒరవడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి కోసం ‘లూసిఫర్‌’హక్కుల్ని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్‌. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ కూడా మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ అనే మలయాళ చిత్రం హక్కుల్ని సొంతం చేసుకుంది. అక్కడ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్‌ నటించిన చిత్రమిది. తెలుగులో కూడా అగ్ర హీరోనే ఈ కథలో నటించే అవకాశాలున్నాయి. తాజాగా బాలకృష్ణ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి నిర్మాతలు ఆయన్ని సంప్రదించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.