కరోనా నిరోధానికి 1.25 కోట్ల విరాళం ఇచ్చిన బాలకృష్ణ

రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న మానవజాతిపాలిట మహమ్మారి కరోనా వైరస్‌. ప్రస్తుతం దేశ ప్రజలంతా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వల్ల  21 రోజుల పాటు లాక్‌డౌన్‌కి వెళ్లారు. ఈ విపత్తులో సాయంగా దేశంలో వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది సాయం అందించారు. ప్రస్తుతం తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కోటి ఇరవైదు లక్షల రూపాయలను విరాళం ఇచ్చాడు. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరి 50 లక్షల రూపాయలు అందించారు. మరొక 25 లక్షలు చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రిసిస్‌ ఛారిటికి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. చిరంజీవి ప్రారంభించిన కరోనా క్రిసిస్‌కి ఇచ్చిన ఇరవై అయిదు లక్షల చెక్కును సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు నిర్మాత సి.కల్యాణ్‌కి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ‘‘..నా ప్రియమైన సోదరుడా కృతజ్ఞతలు. కరోనా విపత్తు సమయంలో ఇరు రాష్ట్రాలతో పాటు సీసీసీకి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆపద, అవసరం ఉన్న సమయాల్లో సాయం చేస్తూ మీ మంచి మనసుని చాటుకున్నారు. ప్రతి కష్ట సమయంలోను, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడూ తోడుంటారు’’ అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.