బాలకృష్ణ సరసన ఆ ఇద్దరు ఎవరు!


బాలకృష్ణ సరసన వీళ్లే అంటూ పలువురు కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్‌ కూడా ఇదే అంటూ కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ వర్గాలు మాత్రం కథానాయిక, పేరుని ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి బాలయ్య సరసన ఓ కొత్త భామని చూపించాలని నిర్ణయించారు. అందుకోసం ఇప్పటికే ఇద్దరు కథానాయికల పేర్లని ఖరారు చేశారు. ఒకరు దక్షిణాదికి చెందినవాళ్లైతే, మరొకరు హిందీకి చెందినవాళ్లు. చిత్రీకరణకి ముందు వాళ్లలో ఒకరిని ఖాయం చేసి ఆ తర్వాత రంగంలోకి దిగాలనేది ఆయన ప్రణాళిక. సినిమాకి పేర్లూ రెండు అనుకున్నారట. ప్రచారంలోకి వచ్చిన పేర్లు మాత్రం కాదని, చిత్రీకరణకి ఇంకా సమయం ఉంది కాబట్టి పేరుపై సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత రూపొందుతున్న చిత్రమిదే. ఇందులో బాలకృష్ణ రెండు రకాల గెటప్పుల్లో కనిపించబోతున్నారు. అందులో అఘోరా ఒకటి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.