బాలయ్య ఔదార్యం

బాలయ్య అంటే మూడు దశాబ్దాలుగా వెండితెరపై అగ్ర నటుడిగా కొనసాగుతున్న కథానాయకుడు. మాస్‌ ప్రేక్షకులకు యువరత్న. ఆయన ఇప్పుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ అమ్మాయికి సహాయం అందించి ఔదార్యం చాటుకున్నారు. బసవతారకం ఇండో కేన్సర్‌ ఆసుపత్రిలో ఆమెకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆ అమ్మాయిది అనంతపూర్‌. వారిది పేద కుటుంబం. చికిత్స పొందుతున్న ఆమెను ఆసుపత్రికి వెళ్లి పలకరించి మానసికంగా దృఢంగా ఉండాలని ధైర్యం చెప్పారు. ఆ కుటుంబ సభ్యులతో కొంత సేపు గడిపారు. అందుకు సంబంధించిన వార్త, ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.