ఈ పాట నా చిన్ననాటి కల!

ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు బప్పీ లహరి ఓ పాటపై మనసు పారేసుకున్నాడు. ఆ పాటను ఎన్నాళ్ల నుంచో సినిమాలో పాడాలను కున్నాడు. కానీ ఇప్పటి వరకు అలాంటి అవకాశమే రాలేదు. ఇంతకీ ఆ పాట ఏంటంటే ‘జుమ్కా బరేలీ వాలా’. త్వరలో తెరపైకి రాబోయో ‘ఇష్క్‌ నచౌండా హై’ సినిమా కోసం పాడుతున్నారు. ఈ పాటను లక్నోలో చిత్రీకరించారు. ఈ పాట నేపథ్యం గురించి బప్పీ మాట్లాడుతూ..‘‘సుమారు యాభై సంవత్సరాల కిత్రం ఈ పాట నా మనసులో నాటుకుపోయింది. ముఖ్యంగా ‘‘జుమ్కా గిరా రే, బరేలీ కే’’ పాట 1966లో వచ్చిన ‘మేరా సయా’ చిత్రంలోని ‘‘జుమ్కా గిరా రీ, బరేలీ కే బజార్‌ మెయిన్‌’’ నాకు ప్రేరణ. ఈనాటికి నా కల నెరవేరబోతుంది. ఈ పాట బరేలి ప్రజలకు అంకింతం. ఇప్పటికే పాటకి ట్యూన్‌ కట్టడం మొదలుపెట్టాను..’’ అని చెప్పారు. ముఖేష్‌ భారతీ హీరోగా వస్తున్న చిత్రానికి మంజు భారతి నిర్మాతగా వ్యవరిస్తున్నారు. కొన్ని కోరికలు నెరవేరాలంటే ఇన్ని సంవత్సరాలు వేచి చూడాల? అందుకే వెనకటికి ఓ కవి అన్నాడు..‘‘ఎదురు చూడడంలోనే ఆనందం ఉందని’’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.