స్టూవర్టుపురానికి వెళ్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’

‘టైగర్‌ నాగేశ్వరరావు’.. ఈ పేరు ప్రస్తుత తరానికి అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ, 1980 - 90 దశకాల్లో ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిందనే చెప్పాలి. స్టూవర్టుపురం గజదొంగగా టైగర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పుడీ గజదొంగ జీవితాధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీకృష్ణ. టైటిల్‌ పాత్రను యువహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ వచ్చే నెల నుంచి స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో మొదలుకాబోతుందట. ఇక్కడే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఇందులో బెల్లంకొండకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రాస్తున్నారట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.