చిన్న బెల్లంకొండ కోసం ఇంత చిన్న పాపా??

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ నట వారసుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఇప్పటికే తెరపై సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్‌ను కూడా తెరకు పరిచయం చేయబోతున్నారు. యువ దర్శకుడు పవన్‌ సాధినేని తెరకెక్కించబోయే చిత్రంతో ఈ యువ హీరో తెరకు పరిచయం కాబోతున్నాడు. దీనికి మరో ప్రముఖ యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ స్క్రిన్‌ప్లేను అందించబోతున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌కు వెళ్లనున్న నేపథ్యంలో చిత్ర బృందం నటీనటుల కోసం ఆడిషన్స్‌ కూడా నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రంలో గణేష్‌కు జోడీగా కనిపించబోయే ఓ నాయిక పాత్ర కోసం ఓ చిన్నపాపను పట్టుకొస్తోందట చిత్ర బృందం. ఆమె మరెవరో కాదు.. ‘మజిలీ’ చిత్రంతో తెలుగు వారికి దగ్గరయిన అనన్య అగర్వాల్‌. 16 ఏళ్ల ఈ యువ తారక ఇప్పటికే బాలీవుడ్‌లో పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. ‘మజిలీ’లో నాగచైతన్యకు కూతురిగా కనిపించి మెప్పించింది. ఇప్పుడీ భామనే గణేష్‌ చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం చేయబోతున్నారట. వయసు రిత్యా అనన్య చిన్నదే అయినప్పటికీ చూడటానికి కాస్త ఎక్కువ వయసున్న ఆమెలాగే కనిపిస్తుంది. అందుకే ఈ పాత్ర కోసం ఆమెనే తీసుకున్నారట. ఓ సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.