ఈ విరామం ఇష్టమైన వారికోసం!

కరోనా పుణ్యమాని ఇప్పుడు చాలామంది సినీ తారలు షూటింగ్‌లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అలాంటి వారిలో మలయాళి నటి భావన కూడా ఉంది. ప్రస్తుతం కేరళరాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ సందర్భంగా నటి భావన ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలే చెప్తూ ఇయర్‌ ఫోన్‌ చెవిలో పెట్టుకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇంతకీ భావన ఏమీ ఇన్‌స్టాలో ఏం చెప్పిందంటే.. ‘‘ఇతురులకు దూరంగా ఉంటూ, చదువుతూ, సంగీతం వింటూ ఉండాలి. ఇష్టమైన వారితో కొంత సమయాన్ని గడపవచ్చు. అంతేకాదు అందరూ గుంపుగా ఉండకుండా దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని’’ సెలవిచ్చింది. భావన - గోపీచంద్‌ సరసన ‘ఒంటరి’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించింది. ఆ తరువాత నితిన్‌ సరసన ‘హీరో’, శ్రీకాంత్‌తో కలిసి ‘మహత్మా’లో నటించి అలరించింది.



View this post on Instagram

A post shared by Bhavs ??????? (@bhavanaofficial) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.